News March 2, 2026

గద్వాల: మైనారిటీ యువతులకు ఉచిత టైలరింగ్ శిక్షణ

image

తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని మైనారిటీ యువతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి నుషిత సోమవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోపు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం (రూమ్ నెం. F-8) నందు సమర్పించాలని ఆమె సూచించారు.

Similar News

News March 2, 2026

పెరుగు తింటున్నారా?

image

పెరుగు తింటే దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది అపోహ పడతారు. అయితే అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. అందులోని ప్రోబయాటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. పాల కంటే పెరుగు సులభంగా జీర్ణం అవుతుందని చెప్పారు. బయట లభించే పెరుగు కంటే ఇంట్లోనే తాజాగా చేసుకోవడం ఉత్తమం అని, ఫ్రిజ్‌లో ఉంచింది కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు మంచిదని సూచిస్తున్నారు.
Share It

News March 2, 2026

SRCL: ప్రజావాణిలో 164 దరఖాస్తుల స్వీకరణ

image

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’కి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌ స్వయంగా 164 దరఖాస్తులను స్వీకరించారు. ఆయా సమస్యలను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆమె అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

News March 2, 2026

హైదరాబాద్: జలమండలిలో ఇక ‘ఈ-ఆఫీస్’ పాలన

image

జలమండలిలో పారదర్శకత కోసం ఎండీ అశోక్ రెడ్డి ‘ఈ-ఆఫీస్’ వ్యవస్థను ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో భౌతిక ఫైళ్లకు స్వస్తి పలికి, డిజిటల్ విధానంలోనే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. దీనివల్ల ఫైళ్ల కదలికను ట్రాక్ చేస్తూ సత్వర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. తొలుత ప్రధాన కార్యాలయంలో, అనంతరం అన్ని డివిజన్లలో ఈ విధానం అమలు కానుంది.