News March 17, 2025
గద్వాల: మొసలి దాడిలో వ్యక్తి మృతి

గద్వాల మండలంలో మొసలి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. UPకి చెందిన రబీదాస్(21) గుర్రంగడ్డలో వంతెన పని చేసుకోవడానికి వలస వచ్చాడు. హోలీ పండగ సందర్భంగా స్నేహితులతో మద్యం తాగాడు. స్నేహితులు వెళ్లాక.. అతడు నదీతీర ప్రాంతంలో ఫోన్ మాట్లాడుతుండగా మడుగులో నుంచి మొసలి వచ్చి అతడిని నదిలోకి లాక్కెళ్లింది. ఆదివారం ఉదయం రైతులకు అతడి నదిలో అతడి మృతదేహం కనిపించింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 8, 2025
JIO: ఉచితంగా జెమినీ ఏఐ ప్రో ప్లాన్!

ఇప్పటివరకు 18-25 ఏళ్ల మధ్య వారికే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్‌ను ఇప్పుడు 25ఏళ్లు పైబడిన వారికీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. My Jio యాప్‌లో దీన్ని క్లైమ్ చేసుకోవచ్చు. ఇందుకు 5G ప్లాన్ యాక్టివేటై ఉండాలి. దీని ద్వారా రూ.35,100 విలువైన జెమినీ ప్లాన్ 18నెలల పాటు ఫ్రీగా పొందొచ్చు. ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి.
News November 8, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 08, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.03 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 8, 2025
ఈనెల 10న హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

ఈనెల 10న (సోమవారం) హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై హనుమకొండ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేల సంఖ్యలో యువకులు ఈ రిక్రూట్‌మెంట్‌కు హాజరవుతుండడంతో ఎలాంటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇన్‌స్పెక్టర్ అధికారులతో చర్చించారు.


