News March 17, 2025
గద్వాల: మొసలి దాడిలో వ్యక్తి మృతి

గద్వాల మండలంలో మొసలి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. UPకి చెందిన రబీదాస్(21) గుర్రంగడ్డలో వంతెన పని చేసుకోవడానికి వలస వచ్చాడు. హోలీ పండగ సందర్భంగా స్నేహితులతో మద్యం తాగాడు. స్నేహితులు వెళ్లాక.. అతడు నదీతీర ప్రాంతంలో ఫోన్ మాట్లాడుతుండగా మడుగులో నుంచి మొసలి వచ్చి అతడిని నదిలోకి లాక్కెళ్లింది. ఆదివారం ఉదయం రైతులకు అతడి నదిలో అతడి మృతదేహం కనిపించింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీ, వినియోగం (2/2)

ముందు చెప్పిన పదార్థాలను ఒక సిమెంట్ తొట్టె/డ్రమ్ములో వేసి బాగా తిప్పాలి. 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పిఉంచాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోయాలి. ఇదే నీమాస్త్రం. దీన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. వారం లోపు వాడేసుకోవాలి.
News November 6, 2025
మరో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నిన్న తార్లగూడెం <<18207908>>ఎన్కౌంటర్లో<<>> ముగ్గురు మావోలు చనిపోయిన సంగతి తెలిసిందే.


