News January 26, 2026

గద్వాల: రాజ్యాంగ విలువలే పోలీస్ శాఖకు మార్గదర్శకం: ఎస్పీ

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్యాంగ విలువలే పోలీస్ శాఖకు మార్గదర్శకమని, క్రమశిక్షణ, నిబద్ధతే పోలీసుల బలమని ఆయన స్పష్టం చేశారు. అమరవీరులకు నివాళులర్పించి, రాజ్యాంగ స్ఫూర్తితో శాంతిభద్రతలను కాపాడాలని పిలుపునిచ్చారు.

Similar News

News February 11, 2026

VIRAL: రైలులో గణేశుడి ఆలయం.. తెలుసా?

image

బిహార్‌లోని జయనగర్ నుంచి అమృత్‌సర్ వెళ్లే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఒక అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఇందులోని S-1 కోచ్‌లో 37వ నంబర్ బెర్త్‌ను గణేశుడికి కేటాయించారు. అక్కడ ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత 12 ఏళ్లుగా ప్రయాణికులు ఎవరూ ఈ బెర్త్‌ను బుక్ చేసుకోకుండా దేవుడికే వదిలేస్తున్నారు. ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం విశేషం.

News February 11, 2026

పల్నాడు: నకిలీ గ్రూపుల గుట్టురట్టు.. 8 మంది సస్పెన్షన్

image

పల్నాడు జిల్లా మెప్మా విభాగంలో నకిలీ స్వయం సహాయక సంఘాల పేరిట సాగుతున్న భారీ అవినీతి బట్టబయలైంది. లేని గ్రూపులను సృష్టించి, బ్యాంక్ రుణాలను కాజేస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు మెప్మా పీడీ మురళీకృష్ణ 8 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

News February 11, 2026

తిరుమల: మార్కెటింగ్ విభాగంలో ఓ అధికారి పాత్ర..?

image

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో సిట్ లేఖపై మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. లంచాలు తీసుకుని నెయ్యి ట్యాంకులను వదిలేసినట్లు నిందితులు వద్ద లభించిన డైరీలో ఉండడంతో ఇద్దరినీ విచారించింది. సెక్రటరీని సస్పెండ్ చేసి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించారు. ఇతను ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా, అతని వెనుక అదే విభాగానికి చెందిన ఓ అధికారి ఉన్నారని సమాచారం. అతనిపై ఎలాంటి చర్యలు, పేరు లేకపోవడం గమనార్హం.