News April 12, 2025
గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News October 21, 2025
మద్నూర్: రావి ఆకుపై పోలీసుల అమర వీరుల స్థూపం

మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న బాస బాల్ కిషన్ పోలీసుల అమర వీరుల దినోత్సవం సందర్భంగా రావి ఆకుపై అమర వీరుల స్థూపం చిత్రం వేశారు. శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నంలో అమరులైన పోలీసులను మరువరాదని చిత్రం ద్వారా చూపిస్తూ నివాళి అర్పించారు. ఈ చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్‌ను అభినందించారు.
News October 21, 2025
ఎమ్మార్వో, ఆర్ఐ అక్రమాలపై విచారణ- అనిరుధ్ రెడ్డి

ఉదండాపూర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని MLA అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అప్పటి తాహశీల్దార్, ఆర్ఐ అక్రమాలపై ఫిర్యాదులను నేరుగా లేదా వాట్సాప్ నంబర్ 9392017899కు పంపించాలన్నారు. ప్రస్తుతం 23 మంది అక్రమార్కులకు నోటీసులు జారీ చేశామన్నారు. రూ.3.84 కోట్ల రికవరికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
News October 21, 2025
తరింపజేసే పంచమహామంత్రాలు

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.