News September 15, 2025
గద్వాల: రుణాలు సకాలంలో మంజూరు చేయాలి: కలెక్టర్

గద్వాల జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని బ్యాంకులు రైతులకు పంట, అనుబంధ రంగాల రుణాలు, ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్యా, గృహ రుణాలు తదితర ప్రాధాన్యతా రంగాల రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ మల్లు రవితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వకర్మ యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయాలన్నారు.
Similar News
News September 16, 2025
సిరిసిల్ల: ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివి’

సిరిసిల్లలోని కలెక్టరేట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణం కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని కొనియాడారు. ఆయన నిర్మించిన సాగునీటి, తాగునీటి కట్టడాలు ఆయనకున్న పట్టుదల నిజాయితీని ప్రపంచం కీర్తించిందని పేర్కొన్నారు.
News September 16, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News September 16, 2025
ప.గో: 13 మంది ఉద్యోగులకు పదోన్నతి

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌లో ఏఓలు, డిప్యూటీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ శ్రమను గుర్తించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.