News December 18, 2025
గద్వాల: రూ.లక్షలు ఖర్చు పెట్టి.. నిరాశే మిగిలి!

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన 3 విడతల సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీ ఇటీవల సాధారణంగా మారింది. అదేవిధంగా ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఉండడంతో ఆ పదవికి కొందరు డబ్బులు ఖర్చుపెట్టినట్లు వినికిడి. పలు గ్రామాల్లో కొందరు అభ్యర్థులు రూ.లక్షలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవలేక అప్పులు, నిరాశలో కూరుకుపోయారని చర్చించుకుంటున్నారు.
Similar News
News December 19, 2025
జనగామ: పల్లెల్లో మొదలైన పంచాయతీలు..!

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయి. కానీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి పల్లెల్లో పంచాయతీలు మొదలయ్యాయి. గ్రామ సర్పంచ్ స్థానం గెలిచేందుకు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను మరిచి విచ్చలవిడిగా డబ్బు, మద్యం, మాంసం, చీరలు, కానుకలు, ఓటర్లకు పంచి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థులు పంచిన డబ్బుకోసం తమకు ఓటు వేయలేదని ఓటర్లతో గొడవలకు దిగుతున్నారు.
News December 19, 2025
భద్రాద్రిలో 461 పంచాయతీలు ఎస్టీలకే..!

జిల్లాలో మొత్తం 471 పంచాయతీలు ఉండగా.. షెడ్యూల్డ్ ఏరియా కారణంగా 460 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. జనరల్ కేటగిరీలోనూ ఓ ST అభ్యర్థి విజయం సాధించడంతో వారి సంఖ్య 461కి చేరింది. రిజర్వేషన్లు లేని మిగిలిన 11స్థానాల్లో జనరల్ కింద 9, ఎస్సీలకు 2 కేటాయించారు. జనరల్ స్థానాల్లో ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ, నలుగురు ఓసీ అభ్యర్థులు గెలుపొందగా.. రిజర్వ్ చేసిన రెండు చోట్లా ఎస్సీ అభ్యర్థులే విజయం సాధించారు.
News December 19, 2025
ఇంటర్ అర్హతతో 394 పోస్టులు.. అప్లై చేశారా?

UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026కు దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్(MPC) ఉత్తీర్ణులైనవారు DEC30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. *మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


