News January 24, 2025
గద్వాల: రూ.63.25 కోట్లతో తాగునీటి పథకం ప్రారంభం

గద్వాల మున్సిపల్ పరిధిలో వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండకుండా అమృత్ 2.0 పథకం కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గద్వాల పట్టణంలో నది అగ్రహారం ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.O పథకం కింద రూ.63.25 కోట్ల వ్యయంతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ సంతోష్ తో శంకుస్థాపన చేశారు.
Similar News
News July 5, 2025
తల్లిదండ్రులకు పోలీసుల సూచన!

పిల్లలు ఇంటి నుంచి తరగతి గదికి చేరే వరకూ సురక్షితంగా వెళ్తున్నారా? లేదా? అనేది చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు & బస్సు డ్రైవర్లపై ఉందని పోలీసులు తెలిపారు. ‘స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? నైపుణ్యం కలిగిన డ్రైవరేనా? పికప్, డ్రాప్ టైమ్‌ను పాటిస్తున్నారా? లేదో గమనించాలి. స్కూల్ యాజమాన్యాలు బస్సుల్లో ఎమర్జెన్సీ నంబర్లను రాసి ఉంచాలి’ అని ట్వీట్ చేశారు.
News July 5, 2025
పెందుర్తిలో వ్యభిచార గృహంపై దాడి

పెందుర్తిలో వ్యభిచార గృహంపై పోలీసులు శనివారం దాడులు చేశారు. భార్యాభర్తలమంటూ బీసెట్టి ధనలక్ష్మి, వివేక్ సుజాతనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం రావడంతో సీఐ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. వారిద్దరితో పాటు ఓ విటుడు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డుతో పాటు పూర్తి సమాచారం తెలుసుకోవాలని సీఐ సూచించారు.
News July 5, 2025
గిల్ మరో సెంచరీ

ENGతో రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అదరగొడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్సులో భారీ డబుల్ సెంచరీ చేసిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్సులో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 129 బంతుల్లో 100* రన్స్ చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 303/4గా ఉంది. 483 పరుగుల ఆధిక్యంలో ఉంది.