News February 8, 2026
గద్వాల: రేపటితో ముగియనున్న ప్రచారం.. మద్యం దుకాణాలు బంద్

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5:00 గంటలతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమయం ముగిశాక ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు సాయంత్రం నుంచే ‘డ్రై డే’ అమల్లోకి రానుందని, ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు.
Similar News
News February 9, 2026
జపాన్ ప్రధాని తకైచిని అభినందించిన మోదీ

జపాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ దేశ ప్రధాని సనే తకైచిని PM నరేంద్ర మోదీ అభినందించారు. ఆమె సమర్థవంతమైన లీడర్‌షిప్‌లో ఇరుదేశాల స్నేహబంధం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నట్టు SMలో పోస్ట్ పెట్టారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడంలో ఇండియా, జపాన్‌ల స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ కీలకపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 9, 2026
HYD: చుక్కేస్తుంటే.. చెక్కేశారు..!

మద్యం సేవిస్తున్న వ్యక్తి నుంచి కొందరు దుండగులు కలిసి బంగారు గొలుసు తెంపుకుని పరారైన ఉదంతం ఇది. పీర్జాదిగూడకు చెందిన అశోక్‌కుమార్ (46) బోడుప్పల్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. ఇదే అదనుగా వచ్చిన ముగ్గురు దుండగులు అతని మెడలోని బంగారు గొలుసు, ఉంగరాలు, ఫోన్, వాలెట్‌ను దోచుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.