News November 8, 2025

గద్వాల: రేపు న్యాయవాదుల పాదయాత్ర

image

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఉదయం 9:00 గంటలకు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయం నుంచి హైదరాబాద్‌ వైపు పాదయాత్ర మొదలవుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు శనివారం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయ బంధువులందరూ పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News November 8, 2025

ఎర్రచందనం దుంగలు పట్టుబడితే ఇలా చేస్తారు..!

image

ఎర్రచందనం దుంగలు ఎక్కడ పట్టుబడిన ఏపీకి అప్పగించేలా కేంద్రం నుంచి ప్రత్యేక జీవో తెచ్చారు. దుంగలు పట్టుబడిన వెంటనే వాటికి జీయో ట్యాగింగ్‌తో పాటు బార్ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఎన్ని దుంగలు ఉన్నాయి, వాటి గ్రేడింగ్ ఏమిటి అనే వివరాలు డిజిటలైజేషనే చేయనున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోనున్నారు.

News November 8, 2025

త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

image

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

News November 8, 2025

సోమశిలలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి

image

సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోమశిలలో శనివారం సాయంత్రం సందడి చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సమీపంలో ఉన్న సోమశిల లోని విఐపి పుష్కర ఘాట్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ఏకో టూరిజం ఏర్పాటు చేసిన లాంచ్‌లో కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణించి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. గుర్తించకుండా ముఖానికి మాస్క్ ధరించి అక్కడికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.