News March 20, 2025

గద్వాల: రేషన్ కార్డు లేక లబ్ధిదారుల అవస్థలు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసమని ఈ మధ్యకాలంలో చాలామంది పాత రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకున్నారు. ఇలాంటి వారు అనేక మంది రేషన్ కార్డు లేకపోవడంతో పథకానికి దూరం అవుతున్నామని గద్వాల జిల్లాలోని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 21, 2026

నరసరావుపేట: బిల్లు చెల్లిస్తేనే డెడ్ బాడీని అప్పగిస్తారంట..!

image

నరసరావుపేటలోని ఓ ప్రముఖ గుండె వైద్యశాలలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు (M) కుందుర్తికి చెందిన సాతులూరి పెద్ద ఏడుకొండలు గుండె జబ్బుతో వైద్యశాలలో చేరాడు. నొప్పి తీవ్రం కావడంతో ఏడుకొండలు మృతి చెందాడు. వైద్యశాల యాజమాన్యం మాత్రం బిల్లులు పూర్తిగా చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని పట్టు పట్టడంతో మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు వైద్యశాల వద్ద ఆందోళన చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

News February 21, 2026

కర్నూలు: ‘పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసేయాలి’

image

కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బోర్డు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి కేంద్రాలను తెరిచి ఉంచితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News February 21, 2026

కామారెడ్డికి రానున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు

image

కామారెడ్డిలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి రానున్నారు. సాయంత్రం మూడు గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని రమణారెడ్డితో భేటీ కానున్నట్లు సమాచారం. ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను తెలుసుకోనున్నారు.