News August 29, 2025
గద్వాల: ‘రైతులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం’

గద్వాల జిల్లాలో యూరియా సరఫరా కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో రైతులకు యూరియా సరఫరా చేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద సిబ్బందిని కేటాయించడంతోపాటు అధికారులు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షించారని చెప్పారు.
Similar News
News August 29, 2025
గద్వాల జిల్లా ఎస్పీ ఆదేశాలు

గణేశ్ నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నది అగ్రహారం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జనానికి క్రేన్ ఏర్పాటు చేసి, నదిలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను నియమించాలని, మెడికల్, ఎమర్జెన్సీ సదుపాయాలు కల్పించాలన్నారు.
News August 29, 2025
NLG: బత్తాయి తోటను పరిశీలించిన రైతు కమిషన్ బృందం

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామాన్ని శుక్రవారం తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలోని బత్తాయి తోటను పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాలిపర్తి నాగేశ్వరావు అనే రైతు బత్తాయి తోటలో రాలిన కాయలను కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లకుమాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
News August 29, 2025
కడప: వినాయక నిమజ్జనంలో అపశృతి

కడప జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి నలువురికి గాయాలయ్యాయి. బ్రహ్మంగారిమఠం మండలం రేకలగుంట పంచాయతీ బాగాది పల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా పేలి గ్రామానికి చెందిన పాల కొండయ్య, జగదీశ్, లోకేశ్, దుక్కేశ్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.