News March 15, 2025
గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

అంతర్ రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. మానవపాడు మం. చెన్నిపాడుకి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి (34) తన తల్లి సుబ్బమ్మతో కలిసి కలుగొట్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అలంపూరు చౌరస్తా నుంచి శాంతినగర్ వెళ్లేదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News March 16, 2025
నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్‌పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.
News March 16, 2025
VKB: 12,901 మంది విద్యార్థులకు 68 కేంద్రాలు

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఈవో రేణుకాదేవి తెలిపారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 12,901 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను నిర్వహించేందుకు 920 మంది అధికారులను నియమించినట్లు డీఈవో పేర్కొన్నారు.
News March 16, 2025
తోటి విద్యార్థిని రెండో అంతస్తు నుంచి తోసేసిన మరో విద్యార్థిని

తిరుపతిలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి క్రిందకు తోసేసింది. దీంతో 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి గోప్యంగా చికిత్సను స్కూల్ యాజమాన్యం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.