News March 31, 2025

గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఎర్రవల్లి సమీపంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల మం. గుంటిపల్లికి చెందిన రాజన్న(60) శనివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజన్న అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసునమోదైంది.

Similar News

News April 2, 2025

భదాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుల నియామకం

image

భద్రాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులుగా ప్రముఖ సీనియర్ న్యాయవాదులు లక్కినేని సత్యనారాయణ, అనుబ్రోలు రాంప్రసాద్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు జారీ చేసిన G.O. No.198 ప్రకారం వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ నియామకం ద్వారా న్యాయ సేవాధికార సంస్థ మరింత బలోపేతం అవుతుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

News April 2, 2025

గద్వాల జిల్లా పోలీసుల సీరియస్ WARNING

image

గతంలో ఎప్పుడో జరిగినా వివాదాలు పరిష్కారమై, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో తిరిగి వాటికి సంబంధించిన వీడియోలను మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల సీఐ శ్రీను హెచ్చరించారు. కావాలని పాత విభేదాలు కలిగి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో మళ్లీ పోస్టు చేసే వారిపై, ఫేక్ న్యూస్‌ను వైరల్ చేసే వారిపై జిల్లా పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టిందని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 2, 2025

నారాయణపేట: ‘విద్యార్థుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం’

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. యూనివర్సిటీలో భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ తరఫున విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూములు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గాలని సూచించారు.

error: Content is protected !!