News March 25, 2024
గద్వాల: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బతో ఉపాధి కూలీ చనిపోయిన ఘటన ఎర్రవల్లి మండలంలో జరిగింది. వల్లురుకు చెందిన చిన్నకృష్ణ(55) శనివారం ఉపాధి పనికి వెళ్లి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చూపించారు. రాత్రి భోజనం చేసి పడుకున్న అతను తెల్లారేసరికి మృతిచెందాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎండల తీవ్ర నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News November 9, 2025
చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.
News November 9, 2025
MBNR: తుప్పు పట్టిన 104 అంబులెన్స్‌లు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దాదాపు ఆరు 104 అంబులెన్స్‌లు నిలుచున్న తోనే తుప్పు పట్టి తూట్లు పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదని ప్రజలు అంటున్నారు. డీఎంహెచ్వో కృష్ణయ్యను Way2News వివరణ అడగగా.. ఆ వాహనాలు వేలం కోసం ఉన్నాయని, వేలంలో అమ్ముతామని తెలిపారు.
News November 9, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.


