News October 15, 2025
గద్వాల: ‘విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి’

విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలు బోధించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం బురదపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతిరోజు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఆ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
Similar News
News October 16, 2025
గద్వాల: ‘ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలి’

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆయన ఎంపీడీవోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంశాలు, వస్తున్న సమస్యలపై క్షుణ్ణంగా విశ్లేషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు.అధికారులు పాల్గొన్నారు.
News October 16, 2025
JGTL: ‘సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ పునరుద్ధరించాలి’

ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీపీఎస్ (CPS)ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ ఏనుగు సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం జగిత్యాలలో జరిగిన టీజీవో కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న PRC రిపోర్టును వెంటనే తెప్పించుకుని, 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
News October 16, 2025
తాలిబన్లు మనకు శత్రువులా?

<<18023858>>అఫ్గానిస్థాన్<<>>లోని తాలిబన్లు నిరంతరం యుద్ధాల్లో ఉండటంతో వారు మనకూ శత్రువులేనా అని పలువురు అనుకుంటారు. మనకు, వారికి ఇప్పటివరకు విభేదాలు/శత్రుత్వం రాలేదు. 1999లో పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు నేపాల్-ఢిల్లీ IC 814 విమానాన్ని హైజాక్ చేశారు. దాన్ని అఫ్గాన్‌లో ల్యాండ్ చేశారు. తాలిబన్లకు చెడ్డపేరు వచ్చేందుకు ఆ ప్లాన్ చేశారు. కానీ తాలిబన్లు ఆ విమానానికి రక్షణగా ఉండటంతో పాటు ఎవరికీ అపాయం కలగకుండా చూశారు.