News November 7, 2025
గద్వాల: విషాదం.. హాస్టల్‌లో విద్యార్థి SUICIDE

HYD తెలుగు విశ్వవిద్యాలయం వసతిగృహంలో విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన పద్మ కుమారుడు పరశురాం(20) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం హాస్టల్ గది తలుపు తెరవకపోవడంతో సిబ్బంది బద్దలుకొట్టి చూడగా, పరశురాం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 13, 2026
నిర్మల్: ‘అర్హులైన యువత దరఖాస్తు చేసుకోండి’

కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం మూడో దశకు జిల్లాలోని అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. యువతకు తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు. ఈ ఇంటర్న్‌షిప్ 6 నుంచి 12 నెలల వరకు ఉంటుందని.. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుందని వివరించారు.
News April 13, 2026
మార్కాపురం: అద్దం పగిలిన ట్రావెల్స్ బస్సుకు ఫైన్.. ఎంతంటే.!

మార్కాపురంలో అద్దం పగిలిపోయిన ప్రైవేట్ <<19635006>>ట్రావెల్స్ బస్సు<<>>ను పోలీసులు అదుపులోకి తీసుకొని రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ KLరావు బస్సుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని పరిశీలించారు. అనంతరం గ్లాసు లేనందున రూ.2వేలు, ప్రమాదకర డ్రైవింగ్ చేస్తున్నందున రూ.2వేలు, డ్రైవర్ ప్రవర్తన సరిగా లేనందున రూ.600 జరిమానా విధించినట్లు కేఎల్ రావు తెలిపారు.
News April 13, 2026
భద్రాద్రి కొత్తగూడెం: స్వీయ క్రమశిక్షణతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఐటీఐ కళాశాలలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. స్వీయ క్రమశిక్షణతోనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పక ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిబంధనల ఉల్లంఘన ప్రాణాంతకమని ఆయన స్పష్టం చేశారు.


