News January 28, 2025

గద్వాల: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

గద్వాల పట్టణంలోని బసవన్న చౌరస్తా సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ‌దాడిలో కడప జిల్లాకు చెందిన నిర్వాహకుడితో పాటు, అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన ఓ మహిళ, కర్నూల్ జిల్లాకు చెందిన మరొక మహిళ దొరకగా, ముగ్గురు విటులను అరెస్టు చేసి 7 ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Similar News

News October 21, 2025

వరుసగా 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు గెలిచే అవకాశం ఉన్నా చివర్లో 2 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి 4 బంతుల్లో వరుసగా 4 వికెట్లు పడ్డాయి. దీంతో SLకు ఊహించని విజయం దక్కింది. అంతకుముందు శ్రీలంక 202 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో WC నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా BAN నిలిచింది.

News October 20, 2025

MBNR జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

@మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా దీపావళి సంబరాలు.
@రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో టిప్పర్ ఢీకొని.. లారీ డ్రైవర్ మృతి.
@కౌకుంట్లలో ముగిసిన సదర్ ఉత్సవాలు.
@జడ్చర్లలో పిచ్చికుక్కల దాడి.. చిన్నారులకు గాయాలు.
@జాతీయస్థాయి SGF అండర్-17 వాలీబాల్ పోటీలకు నవాబుపేట యన్మంగండ్ల చెందిన జైనుద్దీన్ ఎంపిక.
@కురుమూర్తి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
@మిడ్జిల్ రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు.

News October 20, 2025

దర్శకుడిగా మారిన హీరో.. గుర్తుపట్టలేని విధంగా లుక్!

image

విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందులో విశాల్ సూట్ ధరించి తెల్లగడ్డం, కళ్లద్దాలతో గుర్తుపట్టలేని లుక్‌లో ఉన్నారు. ఈ మూవీతో తాను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నానని, పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశాల్ తెలిపారు. దుషార విజయన్, అంజలి తదితరులు నటిస్తున్న ఈ మూవీని RB చౌదరి నిర్మిస్తుండగా, GV ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.