News April 9, 2025

గద్వాల: శతాధిక వృద్ధురాలు మృతి

image

గట్టు మండలం ఆరగిద్దకి చెందిన శతాధిక వృద్ధురాలు పటేల్ గంగమ్మ (110) మంగళవారం సాయంత్రం చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. గంగమ్మకు ఇద్దరు మగ పిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. వృద్ధురాలు మరణించడం పట్ల గ్రామస్థులు, గ్రామ ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

Similar News

News December 21, 2025

KNR: డబుల్‌ ఇళ్ల పంపిణీలో ‘చేతివాటం’

image

KNR నియోజకవర్గంలో 660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి పంపకానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. KNRలో 60 డివిజన్లకు కేవలం 300 ఇళ్లు కేటాయించి, మిగిలిన 360 ఇళ్లను అధికార పార్టీ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు స్పందించి అర్హులకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.

News December 21, 2025

రేపు మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం

image

TG: సీఎం రేవంత్ రేపు HYDలోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పరిషత్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్లోబల్ సమ్మిట్‌లో జరిగిన ఒప్పందాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News December 21, 2025

బందరు – ప్రయాగ్‌రాజ్‌ మధ్య ప్రత్యేక రైలు

image

పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం – ప్రయాగ్‌రాజ్ (07401) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 22న సాయంత్రం 4:20 గంటలకి మచిలీపట్నంలో బయలుదేరి.. గుడివాడ, విజయవాడ, వరంగల్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇందులో ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.