News March 21, 2025
గద్వాల: సుంకేసుల డ్యామ్‌ను పరిశీలించిన కలెక్టర్

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని, ప్రాజెక్టు పనితీరును జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం పరిశీలించారు. అనంతరం రాజోలి గ్రామ సమీపాన ఉన్న సుంకేసుల బ్యారేజిని సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. తహశీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ జగదీశ్వర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దస్తగిరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
నిర్మల్: పది పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9,115 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 21, 2025
ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలి: కలెక్టర్

నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్‌సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు .కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్థులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.
News March 21, 2025
భూపాలపల్లి జిల్లాలో 3,441 మంది విద్యార్థులు హాజరు

భూపాలపల్లి జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలియజేశారు. 3,449 విద్యార్థులకు 3,441 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.