News March 21, 2025

గద్వాల: ‘హార్డ్ కాపీలు సమర్పించాలి’

image

జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న కళాశాల ఉపకార వేతనాలు హార్డ్ కాపీలు ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటలలోగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.

Similar News

News November 6, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

image

మంథని నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కింగ్ చేసిన ఇళ్లు, బేస్మెంట్ స్థాయికి చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేయాలని ఆదేశించారు. పెట్టుబడి సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని సూచించారు. నిర్మాణ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 6, 2025

పిల్లలకు మెరుగైన విద్య అందించాలి: పెద్దపల్లి కలెక్టర్

image

పిల్లలకు మంచి విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో 22 పాఠశాలల హెడ్ మాస్టర్లతో విద్యా ప్రమాణాల పెంపుపై సమీక్ష నిర్వహించారు. అత్యుత్తమంగా పనిచేస్తున్న పాఠశాలలను అభినందించి, మంచి ఫలితాల కోసం ఇతర పాఠశాలల టీచర్లను ప్రోత్సహించాలని చెప్పారు. మచ్చుపేట పాఠశాలకు ఆటో ఏర్పాటు, ఏఎక్స్ఎల్ ల్యాబ్ ఏర్పాటుపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News November 6, 2025

KNR: ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి.. అయినా ఈ పరిస్థితి..!

image

ఉమ్మడి KNR జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిపే ఘటన ఇది. మానకొండూరు(M) పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు బస్సులు లేక రాత్రయినా రోడ్డుపై ఎదురుచూస్తూ కనిపించారు. అసలే చీకటి,సీసీ కెమెరాలు లేని ప్రాంతం, అమ్మాయిల భద్రతకు బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి ఉన్న జిల్లాలో ఈపరిస్థితి ఏంటని అంటున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.