News December 11, 2025
గద్వాల: 4మండలాల్లో 1,31,679 మంది ఓటర్లు

గద్వాల జిల్లాలోని మొదటి విడత ఎన్నికలు జరిగే 4మండలాల్లో మొత్తం 106 గ్రామ పంచాయతీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. వాటిలో 14 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 92 పంచాయతీల్లో సర్పంచ్, 839 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. 92 గ్రామపంచాయతీలలో మొత్తం 1,31,679 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 66,994 మంది మహిళలు, 64,684 మంది పురుషులు, ఇతరులు ఒకరు ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
అనుకోని అతిథి ఎందుకొచ్చారు?

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చీ రావడంతోనే <<18545632>>CM రేవంత్ రెడ్డి<<>>తో, ఆ వెంటనే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతోనూ సమావేశం అయ్యారు. త్వరలోనే అఖిలేశ్ KCRను కలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో BJPకి వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విభజన రాజకీయాలు అంతం కావాలని అఖిలేశ్ చెప్పడంతో కూటమి ప్రయత్నాలే అంటూ చర్చ మొదలైంది.
News December 13, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✓నేటితో ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓రేపు సారపాక, పినపాక ప్రాంతాల్లో పవర్ కట్
✓సుజాతనగర్ PHCని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
✓పాల్వంచ పెద్దమ్మ తల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
✓బూర్గంపాడు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
✓భద్రాచలం: ముక్కోటి గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్
✓మణుగూరు: అడవిలో చెట్ల నరికివేత హైకోర్టు బ్రేక్
✓రేపు నవోదయ ప్రవేశ పరీక్ష… జిల్లాలో 8 కేంద్రాలు
News December 13, 2025
యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్నించిన ఎంపీ కావ్య

దేశంలో యోగా ప్రచారం, హర్బల్ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై లోక్ సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వివరించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.


