News April 1, 2025
గద్వాల: NSUI సంఘం నేతలపై పెట్టిన కేసు కొట్టివేత

గత ప్రభుత్వ హయాంలో విద్యార్థి సంఘాల నేతలపై పెట్టిన కేసులతో తీవ్ర ఇబ్బంది పడ్డారని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని న్యాయబద్ధంగా పోరాడితే అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు బనాయించారని NSUI గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ చొరవతో న్యాయవాది సురేశ్ గౌడ్ నేతృత్వంలో తనపై పెట్టిన 491/21 కేసును కొట్టివేస్తూ గద్వాల జడ్జి తీర్పునిచ్చారని తెలిపారు.
Similar News
News April 3, 2025
IPL: ఆర్సీబీ ఓటమి

బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 49), బట్లర్(39 బంతుల్లో 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే స్కోర్ ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.
News April 3, 2025
మారుతీ కార్లు కొనేవారికి షాక్

ఏప్రిల్ 8 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.62,000 వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ముడి సరకుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడం, కార్లలో మెరుగైన ఫీచర్స్ ఇందుకు కారణమని తెలిపింది. మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది. SUV Fronx-Rs.2500, Dzire Tour S-Rs.3000, XL6, Ertiga-Rs.12,500, Wagon R-Rs.14000, Eeco van-Rs.22,500, SUV Grand Vitara-Rs.62,000.
News April 3, 2025
MBNR: ‘హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలి’

గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంపై వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూకు MBNR బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అరణ్య భవన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో చట్టాలను ఉల్లంఘించి, వివిధ జంతు, వృక్ష జాతుల మనుగడకు హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వినతిపత్రంలో బీఆర్ఎస్ నేతలు కోరారు.