News March 2, 2025
గన్నవరం: ఎమ్మెల్యే యార్లగడ్డ దృష్టికి సమస్యలు

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును విజయవాడ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలను వివరించగా, ఆయన వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 3, 2025
కృష్ణా జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు

కృష్ణా జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు.. జిల్లా పోలీస్ శాఖ మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తోంది. రెండవ రోజైన మార్చి 2న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళలు, విద్యార్థినులకు యోగ శిక్షణ నిర్వహించారు.
News March 2, 2025
కృష్ణా జిల్లాలో మండుతున్న ఎండలు

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుడివాడ 38°, బాపులపాడు 38°, గన్నవరం 38°, బందరు 34°, పెనమలూరు 37°, పామర్రు 34°, అవనిగడ్డ 32 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పలుచోట్ల పిల్లలు ఎండలను సైతం లెక్కచేయకుండా ఆటలాడుతున్నారు.
News March 2, 2025
ఉంగుటూరు: విద్యార్థులతో తాపీ పనులు

ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులతో ఎండలో పని చేయిస్తున్న ఘటన కలకలం రేపింది. హెచ్.ఎం, డ్రిల్ మాస్టర్ ఆదేశాలతో విద్యార్థులతో తాపీ పని చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవిలో చెప్పులు లేకుండా విద్యార్థులతో పనిచేయించడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్‌లో ఇలా చేయించడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.