News March 18, 2026
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గాలులు.. విమానం దారి మళ్లింపు

గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఈదురుగాలులు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయిన వెంటనే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశారు. విమానం కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టి, అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ గన్నవరం బయల్దేరి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News April 2, 2026
చద్దాకు వెల్లువెత్తుతున్న మద్దతు!

రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా <<19547250>>రాఘవ్ చద్దా<<>>ను ఆప్ తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. SMలో ఆయనకు మద్దతుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పక్షాన నిలబడిన MPకి ఇచ్చే గౌరవం ఇదా అని నిలదీస్తున్నారు. ఆయనకు అన్యాయం జరిగిందంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొలగింపునకు గల కారణాలను పార్టీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీంతో చద్దాకు, పార్టీకి మధ్య ఏమైనా విభేదాలున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
News April 2, 2026
TU: ట్రాన్స్జెనిక్ పంటలు-ఆధునిక వ్యవసాయంలో విప్లవం

టీయూ వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ట్రాన్స్జెనిక్ పంటలు-ఆధునిక వ్యవసాయంలో విప్లవం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. OU ప్రొ.సబితా రాణి హాజరై మాట్లాడారు. ఆధునిక వ్యవసాయంలో జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రభావం&స్థిరమైన పంట ఉత్పత్తిపై లోతైన అవగాహన అవసరమని, జెనెటిక్ మోడిఫికేషన్ టెక్నిక్స్, జెనోమ్ ఎడిటింగ్, మాలిక్యులర్ బ్రీడింగ్ వంటి సాంకేతికతలను వివరించారు. TU అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News April 2, 2026
ఇసుక రవాణాలో పారదర్శకత పాటించాలి: ADB కలెక్టర్

జిల్లాలో ఇసుక రవాణా పారదర్శకంగా సాగాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మన ఇసుక – వాహనం’ పోర్టల్ పనితీరు, ఇసుక నిల్వలను సమీక్షించారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మైనింగ్ ఏడీ రవీందర్ పాల్గొన్నారు.


