News February 18, 2026

గన్నవరం ఎయిర్‌పోర్ట్.. ఒకే రోజు 3,883 మంది ప్రయాణం!

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మంగళవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 2,062 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,821 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.

Similar News

News February 18, 2026

పిల్లలకు డబ్బాపాలు పడుతున్నారా?

image

డబ్బా పాలు పట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. * అత్యవసరం అయితే తప్పా డబ్బా పాలు పట్టకూడదు. సీసాలో ఇస్తున్నప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఇవ్వాలి. డబ్బా పాలే కదా అని పడుకోబెట్టి ఇవ్వకూడదు. * నెలలు నిండని పిల్లల్లో అవయవాలు ఎదగక కూడా పాలు పట్టినప్పుడు జీర్ణాశయంలోకి సాఫీగా వెళ్లక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శిశువుల ఎదుగుదలను బట్టి, వారి వయసుకు అనుగుణంగా వైద్యుడి సలహా మేరకు మాత్రమే పాలు పట్టాలి.

News February 18, 2026

గుంటూరు DMHO వేటుకు కారణం అదేనా..?

image

గుంటూరు DMHO బదిలీ అయిన విషయం తెలిసిందే. తురకపాలెంలో ప్రబలిన జ్వరాలను గుర్తించి ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు మృత్యువు భారిన పడుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గతంలో నేరుగా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు ప్రత్తిపాడు MLA రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులున్నాయి.

News February 18, 2026

మారుతీ తొలి ఈవీ SUV కారు.. ఫీచర్స్ ఇవే!

image

ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ తొలి బ్యాటరీ రెంటల్ వాహనం ‘ఈ-విటారా’ SUVని గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కి.మీ దూసుకెళ్లనుంది. బ్యాటరీ యూజ్ ఎ సర్వీస్ ఓనర్‌షిప్ కింద ప్రారంభ ధర రూ.10.99లక్షలుగా ఉంది. మొదలవుతుంది. బ్యాటరీ యూసేజ్ రెంట్ ఛార్జీ కి.మీకు రూ.3.99 చొప్పున చెల్లించాలి. ఈవీ లాంచ్‌తో నిన్న మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి.