News February 15, 2025

గన్నవరం: కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

image

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, రామకృష్ణ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

Similar News

News September 11, 2025

కృష్ణా: సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారుల ఎంపిక

image

కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సబ్ జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీలలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నరేష్ పాల్గొన్నారు.

News September 11, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా: ఈ నెల 13న లోక్ అదాలత్
☞ గరికపర్రులో జిల్లా జూడో జట్లు ఎంపిక
☞ ఉమ్మడి కృష్ణాలో 70 శాతం స్మార్ట్ కార్డుల పంపిణీ
☞ మచిలీపట్నం విజయవాడ హైవే ప్రమాదం.. స్పాట్ డెడ్
☞ కృష్ణా: పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు
☞ చల్లపల్లి పాఠశాల అన్నంలో పురుగులు
☞ చేవేండ్రలో దొంగతనం

News September 11, 2025

కృష్ణా: ఒకేసారి 15 మందికి గవర్నమెంట్ జాబ్స్

image

కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామం ఆదర్శంగా నిలిచింది. చిన్న పల్లెటూరు నుంచి ఒకేసారి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో 8 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. ఇటీవల విడుదలైన డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వీరు అర్హత సాధించారు. 11 టీచర్ పోస్టులు, 3 పోలీస్ ఉద్యోగాలు, ఒకరు సేల్స్ ట్యాక్స్‌లో నియామకం పొందారు.