News April 19, 2024

గన్నవరం గడ్డపై పాగా వేసేదెవరో..

image

గన్నవరంలో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, సిట్టింగ్ MLA వంశీ వల్లభనేని వైసీపీ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన యార్లగడ్డ 838 ఓట్ల తేడాతో ఓడారు. వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ టీడీపీలో చేరి గన్నవరం MLA టికెట్ దక్కించుకుని నేడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల సమరంలో గన్నవరంలో వంశీ ఆధిక్యత చాటుకుంటారో, యార్లగడ్డ గెలుపు తీరాలకు చేరుకుంటారో మీ కామెంట్.

Similar News

News September 30, 2024

సులభతరం కానున్న హైదరాబాద్-విజయవాడ బస్సు ప్రయాణం

image

తెలుగు రాష్ట్రాల్లో కీలక నగరాల మధ్య బస్సు ప్రయాణం సులభతరం వేగవంతం చేసేదిగా ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలకు సరికొత్త మార్గంపై దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్ మీదగా బస్సులు నడిపించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి 2ఈ గరుడ బస్సుల్ని ఓఆర్ఆర్ మీదగా నడిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తద్వారా ప్రయాణికులకు 1.15 గంటల సమయం కలిసి రానుంది.

News September 30, 2024

చల్లపల్లి: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

image

చల్లపల్లి మండలం నూకలవారిపాలెం జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇనుప చువ్వలలోడ్ లారీ ఉదయం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కాగా ఆదివారం ఇదే అవనిగడ్డ నియోజకవర్గంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురికి గాయాలైన విషయం తెలిసిందే.

News September 30, 2024

కృష్ణా జిల్లాలో కొండెక్కిన కూరగాయల ధరలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టమాటా ధర ఠారెత్తిస్తోంది. గతవారం కేజీ రూ.40 పలికిన టమాటా ఆదివారం రూ.80కి పెరిగింది. మిగిలిన కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఉల్లిపాయలు కేజి రూ.50, బీరకాయలు రూ.60, వంకాయలు రూ.80, దొండ కాయలు రూ.40కి అమ్ముతున్నారు. బెండకాయలు కేజి ధర రూ.50, బంగాళాదుంప రూ.40, క్యారెట్‌ రూ.50, పచ్చిమిర్చి రూ.50, అల్లం రూ.140, కాకరకాయ కేజీ ధర రూ.50గా ఉన్నాయి.