News January 28, 2026

గన్నవరం చేరుకున్న మోహన్ భగవత్

image

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆయన రాకను పురస్కరించుకొని విమానాశ్రయ ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం ఆయన గన్నవరం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ కరకట్టపై ఉన్న గోకరాజు గంగరాజు ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు.

Similar News

News February 21, 2026

సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

image

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.

News February 21, 2026

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

image

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ప్రపంచం ముందు మనమంతా ఐక్యంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. రాజకీయ నాటకాలకు AI సమ్మిట్‌ను ఎంచుకోవడం సరికాదని BRS MLA కేటీఆర్ విమర్శించారు. INC కార్యకర్తలు CM రేవంత్ ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన చేపట్టారంటూ Xలో ఎద్దేవా చేశారు.

News February 21, 2026

PDPL: పెళ్లి వేడుకలో వ్యక్తి దారుణ హత్య

image

రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్‌ వద్ద శనివారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)ను గేటు ముందే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.