News February 10, 2025
గన్నవరం: భార్య డబ్బులు ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్య

గన్నవరం మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వీరపనేనిగూడానికి చెందిన రానిమేకల వీరబాబు (44) మద్యానికి బానిసై, భార్య డబ్బులివ్వలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
ఘంటసాల: బ్రతుకు తెరువు కోసం వస్తే బ్రతుకులు తెల్లారాయి

పొట్టకూటి కోసం కోటి కష్టాలని.. బ్రతుకుదెరువు కోసం ప.గో జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం నుంచి ఇద్దరు బొలెరో వాహనంలో వచ్చారు. రొయ్య పిల్లలు తీసుకొని చల్లపల్లి మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఘంటసాల (మ) జీలగలగండి వద్ద నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయడానికి పోలీసులు శ్రమించారు.
News March 14, 2025
MTM: గవర్నర్‌ని కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం VC

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి అబ్దుల్ నజీర్‌ను రాజ్ భవన్‌లో శుక్రవారం కలిశారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి కోరారు.
News March 14, 2025
కృష్ణా: రేపు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

కృష్ణాజిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్టు సీఈఓ కన్నమ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 7 స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆయా స్థాయీ సంఘ ఛైర్మన్ల అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయని తెలిపారు.