News January 3, 2026

గన్నవరం: మంచు అడ్డంకి.. గాల్లోనే సింగపూర్‌ విమానం చక్కర్లు

image

పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం సింగపూర్‌ నుంచి వచ్చిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు వీలుపడక గాల్లోనే చక్కర్లు కొట్టింది. రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో పైలట్లు విమానాన్ని దించలేకపోయారు. వాతావరణం మెరుగుపడిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతిస్తామని, ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు వెల్లడించాయి.

Similar News

News January 7, 2026

వికారాబాద్‌లో ఎలక్షన్.. ఉత్కంఠ

image

పురపాలక ఎన్నికల కసరత్తు వేగవంతం కావడంతో ఆశావహుల్లో రిజర్వేషన్ల సెగ మొదలైంది. జిల్లాలోని తాండూరు(36), వికారాబాద్(34), పరిగి(18), కొడంగల్(12) మున్సిపాలిటీల్లోని 100వార్డుల అభ్యర్థులు తమ స్థానం ఏ క్యాటగిరీకి కేటాయిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల తుది జాబితా అనంతరం రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.

News January 7, 2026

మెదక్: కొత్త పథకం.. రూ.1,00,000 మీకోసమే!

image

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంతన్న కా సహారా మిస్కిన్ కోసం రెండు కొత్త పథకాల కోసం దరఖాస్తులను పునః ప్రారంభించిందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. మెదక్ జిల్లాలో ఉన్న ముస్లిం మైనార్టీస్ (ఫకీర్లు, దూదేకుల, దుర్బల ముస్లిం సమాజాలు) కులాల వారికి చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్ధిక పురోగతిని పెంపొందించడం ఈ పథకం ఉద్దేశమన్నారు.

News January 7, 2026

యాదాద్రి వద్దు.. చార్మినార్‌లో కలపాలి!

image

TGలో మరో ఉద్యమం ఉద్ధృతమవుతోంది. పోలీస్ నియామకాలలో జోన్‌ల వివాదం అగ్గి రాజేసుకుంటోంది. రాచకొండను యాదాద్రి జోన్‌లో ఉంచడం సిటీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయమని మండిపడుతున్నారు. సూర్యాపేట, NLG, యాదాద్రి జిల్లాల వల్ల కట్‌ఆఫ్ పెరిగి మేడ్చల్, RR అర్బన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి కొత్త కమిషనరేట్ కావడంతో, దీన్ని చార్మినార్ జోన్‌లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.