News March 21, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. కోర్టు దర్యాప్తు అధికారిణి హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణలో అధికారిపై వివరాలు కోరనుంది.
Similar News
News March 21, 2025
మచిలీపట్నం: చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య

మచిలీపట్నం చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన విర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను నివాసంలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందారు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకొని మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 21, 2025
కృష్ణా: ‘రెడ్ బుక్‌తో ఏం చేయలేరు’

వైసీపీ నేతల అరెస్ట్‌లతో జగన్ పరపతి ఎక్కడా తగ్గదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏం చేయలేరని, 6 గ్యారంటీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోసానిపై 18 కేసులు పెట్టేందుకు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
News March 21, 2025
కృష్ణా: పదవ తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 98.70% హాజరు

10వ తరగతి పరీక్షల్లో భాగంగా మూడవ రోజైన శుక్రవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 21,114 మంది విద్యార్థులకు గాను 20,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 98.70% నమోదైంది. 33 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ రామారావు తెలిపారు.