News April 5, 2025

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న “జాక్” మూవీ టీమ్

image

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ “జాక్” ప్రమోషన్స్ కోసం చిత్రబృందం శనివారం విజయవాడ విచ్చేశారు. కొద్దిసేపటి క్రితం మూవీ టీమ్‌తో పాటు సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈనెల 10న విడుదల కానున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. 

Similar News

News November 11, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(<>BOB<<>>) 12 కాంట్రాక్ట్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC,ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in

News November 11, 2025

VZM: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలకు అప్లై చేశారా?

image

సఫాయి కర్మచారి యువతకు 3 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై ఇవ్వనున్నారు.
➤యూనిట్ విలువ: రూ.31,67,326
➤సబ్సిడీ: రూ.14,16,831
➤రుణ మొత్తం: రూ17,50,495, వడ్డీ రేటు: 6%
➤చెల్లింపు కాలం: 72 నెలలు (ప్రతి నెల రూ.33,064 వాయిదా)
➤గ్రూప్: 5 మంది అభ్యర్థులు ఉండాలి
➤అప్లై చేసే స్థలం: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, మర్రి చెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్, విజయనగరం
➤చివరి తేదీ: 20-11-2025

News November 11, 2025

ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం: కలెక్టర్

image

జిల్లాలో పంట నష్టాలను తగ్గించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా సిల్వర్ ఓక్‌కు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. కాఫీ తోటలను తెగుళ్ల బెడద నుంచి రక్షించేందుకు అవకాడో, లిచీ, జాక్ ఫ్రూట్, స్వీట్ ఆరంజ్ వంటి విలువైన పంటలను ప్రోత్సహించాలన్నారు. రైతులకు స్థిరమైన ఆదాయం, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పంటలే లక్ష్యం అన్నారు.