News January 25, 2025

గన్నవరం హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

గన్నవరం జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధుడు రోడ్డు దాటుతుండగా లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు లారీ చక్రాల కిందపడి స్పాట్‌లోనే మృతి చెందాడు. గన్నవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 27, 2025

గుడివాడ: కొత్త ఆటోలో తీసుకెళ్లి ప్రాణం కాపాడాడు..!

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడిన ఆటో డ్రైవర్ కందుల శ్యామ్‌కు ఏలూరు కలెక్టర్ రూ.5వేలు, ప్రాణ దాత అవార్డు అందజేశారు. లింగాల గ్రామానికి చెందిన కాటి నిరీక్షణ బాబు కానుకొల్లు వద్ద నవంబరు 28న బైకుపై వెళ్తూ అదుపుతప్పి కిందిపడిపోయాడు. అటుగా ఫ్యామిలీతో కొత్త ఆటోలో వస్తున్న కందుల శ్యామ్, నల్లగుడ్ల రాజు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాబును గుడివాడ ఆసుపత్రిలో చేర్చారు.

News January 27, 2025

పెనమలూరు: ఈడుపుగల్లు సర్పంచ్‌‌కి కేంద్ర అవార్డు

image

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు సర్పంచ్ పందింటి ఇందిర ఆదివారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ (లల్లన్ సింగ్ ), సహాయ మంత్రి ఎస్. పి సింగ్ భగేల్ చేతులు మీదుగా గణతంత్ర వేడుకలలో భాగంగా ఢిల్లీలో ఇందిరకు ఉత్తమ సర్పంచ్ అవార్డును అందజేశారు.

News January 27, 2025

గుడివాడ: గవర్నర్ నజీర్‌ను కలిసిన ఎమ్మెల్యే రాము

image

76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్ నజీర్ ఎమ్మెల్యే రాముతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .