News January 16, 2026
గరివిడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

గరివిరి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండగ నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై లోకేశ్వరరావు, సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సిబ్బందికి స్వీట్స్ అందజేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 11, 2026
రైతులకు మార్కెట్ భరోసా కల్పించాలి: VZM కలెక్టర్

రైతులకు మార్కెట్ సదుపాయం ఉందన్న భరోసా కల్పించినప్పుడే ఉద్యానమిషన్ విజయవంతం అవుతుందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యాన మిషన్ పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సాయంత్రం సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది పదివేల ఎకరాల్లో అదనంగా ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా రబీలో ఇప్పటికే అదనంగా సుమారు 3,300 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జరిగిందన్నారు.
News February 11, 2026
VZM: ‘జిల్లాలో బోద వ్యాధిని పూర్తిగా నిరోధించాలి’

జిల్లాలో బోద వ్యాధిని సమూలంగా నిరోధించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి జె.పి.నడ్డా తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా కలెక్టర్‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గుర్ల మండలం బోద వ్యాధి లేని మండలంగా ఎంపిక చేసి ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక కాంపెయిన్ నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. డీ.ఈ.సీ, ఆల్బెండజోల్ మాత్రలు ఇంటిటికీ పంపిణీ చేయాలని కోరారు.