News March 5, 2025
గరుగుబిల్లిలో వ్యక్తి ఆత్మహత్య

గరుగుబిల్లి మండలానికి చెందిన నాగల్ల సింహాచలం( 56) ఆత్మహత్య చేసుకున్నట్లు కొమరాడ ఎస్సై నీలకంఠం తెలిపారు. ఎస్ఐ కథనం.. మృతుడు గొర్రెల కాపరి. తన కుమారుని వైవాహిక జీవితం సరిగా లేకపోవడంతో మనస్తాపంతో మంగళవారం కొమరాడ మండలం గుమడ గ్రామ దరి గొర్రెల మంద విషం తాగి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 5, 2025
విద్యార్థులు ఇలా చేస్తే పరీక్షలు ఈజీగా రాయొచ్చు!

☛ ఎగ్జామ్ టైమ్‌లో క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి, ముందుగా తెల్సినవి రాయాలి. ఇలా చేస్తే టైమ్ వేస్ట్ అవ్వదు.
☛ పరీక్షలకు ముందు చదవడంతో పాటు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
☛ క్లాస్‌లు జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఫాస్ట్‌గా రాయడం అలవాటౌతుంది.
☛ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రీ ఫైనల్స్ రాయాలి. దీని వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది.
News March 5, 2025
గాజువాకలో భారీ చోరీ

గాజువాక సమీపంలో గల కాపు జగ్గరాజుపేట STBL వసుంధర గార్డెన్స్‌లో చోరీ జరిగింది. ఉమ అనే మహిళ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వసుంధర గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న ఉమ తన తల్లిని చూసేందుకు వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయింది. బుధవారం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులకొట్టి ఉన్నాయని, సుమారు 75 తులాలు బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 5, 2025
సంప్రదాయమేనా? సర్‌ప్రైజ్ ఉంటుందా?

TG: కాంగ్రెస్‌లో MLA కోటా MLC పదవులకు రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిట్టింగ్ MLC జీవన్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. One Leader One Post నిర్ణయంతో నరేందర్‌ను, ఇప్పటికే చాలా ఛాన్సులు పొందారని జీవన్‌ను రెడ్డి నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీనియార్టీ సంప్రదాయాన్ని కాదని OLOPతో పాటు యువరక్తంపై మొగ్గు చూపితే సామ రామ్మోహన్ రెడ్డి వంటి వారికీ సర్‌ప్రైజ్ ఛాన్స్ రావచ్చు.