News January 3, 2026
గరుడుబిల్లిలో పాఠశాలలను తనిఖీ చేసిన : DEO

బొండపల్లి మండలం గరుడబిల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోవ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణ, విద్యార్థి ప్రతిభ పరిశీలన చేసి ప్రతి విద్యార్థి సైనింగ్ స్టార్‌గా మార్చేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
Similar News
News February 11, 2026
VZM: లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

మార్చి 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత కోరారు. బుధవారం బార్ అసోసియేషన్ సభ్యులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో జిల్లా కోర్టులో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు అన్ని సివిల్ దావాలు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. ఎక్కువ కేసులు రాజీ చేసి కక్షిదారులకు డబ్బు, సమయం వృధా కాకుండా చూడాలన్నారు.
News February 11, 2026
VZM: ‘కేంద్ర ప్రభుత్వ నిధులు మార్చిలోగా వినియోగించాలి’

కేంద్ర ప్రభుత్వ నిధులను మార్చిలోగా పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిధుల వినియోగంపై సమీక్షించారు. వివిధ పథకాలను అందుబాటులో ఉన్న సుమారు రూ.40 కోట్లను మార్చి 15 లోగా ఖర్చు చేయడానికి కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.
News February 11, 2026
VZM: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. మార్చి 16 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణకు 119 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం జిల్లాలోని MRO, MPDO, మున్సిపల్ కమిషనర్లతో కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయించి నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.


