News April 7, 2025
గర్భిణులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేసిన పవన్

గర్బిణులు పౌష్టికాహార కిట్లను సద్వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. డుంబ్రిగుడ(M) పెదపాడు గ్రామ సందర్శనలో భాగంగా గ్రామంలో ఉన్న గర్భిణులకు సీమంతం, శిశువులకు అన్నప్రాసన చేశారు. వారికి బాల సంజీవని కిట్లు, గుడ్లు, పప్పు, నూనె, రైస్, చిక్కీలను పవన్ పంపిణీ చేశారు. పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మీ, సీడీపీఓ నీలిమ తదితరులు ఉన్నారు.
Similar News
News April 8, 2025
ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా భేటీ అయ్యారు. టారిఫ్‌ల పెంపు అనంతరం ట్రంప్‌తో భేటీ అయిన తొలి దేశాధినేత ఆయనే కావడం గమనార్హం. సుంకాల విషయంతో పాటు హమాస్‌తో నెలకొన్న పరిస్థితులపైనా వారిద్దరూ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండగా దాన్ని శ్వేతసౌధం ఉన్నట్టుండి రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.
News April 8, 2025
ఖానాపురం: రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

ఖానాపురం మండల కేంద్రంలో ముస్తఫా అనే రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సన్న బియ్యం భోజనం చేశారు. ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని చేపడుతోందని దొంతి అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో ఉమారాణి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News April 8, 2025
ఆర్సీబీని వణికించిన హార్దిక్

నిన్న జరిగిన MIvsRCB మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినప్పటికీ అది అంత సులువుగా రాలేదు. ముంబై కెప్టెన్ హార్దిక్ ఓ దశలో బెంగళూరు బౌలర్లను వణికించారు. ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్ని 6, 4, 6 కొట్టిన ఆయన 8 బంతుల్లో 33 రన్స్ కొట్టి ఓ దశలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసేలా కనిపించారు. చివరికి 15 బంతుల్లో 42 పరుగులకు ఔటయ్యారు. అప్పటికి 11 బంతుల్లో 28 పరుగులు అవసరమైన ముంబై వరసగా వికెట్లు కోల్పోయి చతికిలబడింది.