News September 23, 2025

గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల నివారణ, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య అంశాలపై మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

Similar News

News September 23, 2025

బస్సు ప్రమాదంలో.. చికిత్స పొందుతూ ఒకరి మృతి

image

తూ.గో జిల్లా పెరవలి మండలం తీపర్రు పరిధిలో మంగళవారం RTC బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల మేరకు.. తణుకు డిపో‌నకు చెందిన బస్సు రాజమండ్రి వెళ్తుండగా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కడింపాడుకు చెందిన సలాది సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 23, 2025

భీమవరం: ఇ-డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు

image

భీమవరం డివిజన్‌కు సంబంధించిన ఇ-డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి పొరుగు సేవల పద్ధతిలో దరఖాస్తులు చేసుకోవచ్చునని కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తును అందుబాటులో ఉంచామన్నారు. వాటిని పూరించిన దరఖాస్తులను విద్యార్హత ధృవీకరించబడిన కాపీలతో భీమవరంలోని జిల్లా రెవెన్యూ అధికారి సిసికి అందజేయాలన్నారు. అక్టోబర్ 3‌లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 23, 2025

భీమవరం: ఇన్‌ఛార్జి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా సూరిబాబు

image

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ అధికారిగా ఏవి సూరిబాబు ఇటీవల నియమితులయ్యారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. అన్ని వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలన్నారు.