News March 2, 2026

గల్ఫ్‌లో ఉన్నవాళ్లు భారత్ రావాలంటే?

image

యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. INDకు తిరిగి రావాలనుకునేవారికి ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అదే ఒమన్ మీదుగా IND చేరుకోవడం. ఆ దేశంపై ఇరాన్ దాడి చేయడం లేదు. దీంతో భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్చలు జరిపినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. దుబాయ్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు బైరోడ్ 450km ప్రయాణించాలి.

Similar News

News March 6, 2026

ఎల్లుండి ఫైనల్.. టెన్షన్ అంతా అహ్మదాబాద్ స్టేడియం గురించే!

image

T20WC ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియా అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. తుదిపోరు జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో ఐసీసీ టోర్నమెంట్లలో INDకు రికార్డు బాగాలేదు. 2023 వన్డే WCలో ఓటమి ఎరుగని భారత్ అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో కంగుతిని కప్పు కోల్పోయింది. తాజా WCలో సౌతాఫ్రికాపై 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. 2023 నుంచి భారత్ ICC టోర్నమెంట్లలో రెండే మ్యాచులు ఓడిపోగా ఆ రెండూ అహ్మదాబాద్‌లోనే జరగడం గమనార్హం.

News March 6, 2026

చర్చల్లేవ్.. లొంగిపోవాల్సిందే: ట్రంప్

image

ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. లొంగిపోవడం ఒక్కటే ఇరాన్ ముందున్న మార్గమని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత గొప్ప, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ఇరాన్‌కు గొప్ప భవిష్యత్ ఉందని తెలిపారు. MAKE IRAN GREAT AGAIN (MIGA) అని పిలుపునిచ్చారు.

News March 6, 2026

లిక్కర్ స్కామ్.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, చాణక్యకు చెందిన రూ.441 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసి పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని పేర్కొంది. ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలిందని వెల్లడించింది. కమీషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేశారని వివరించింది.