News April 16, 2025
‘గల్ఫ్‌లో సోన్ మండల యువకుడి హత్య’

సోన్‌కు చెందిన హస్తం ప్రేమసాగర్ దుబాయ్‌లో హత్యకు గురయ్యారు. మృతదేహం అక్కడే ఉండిపోయింది. బాధిత కుటుంబానికి MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, నాయకులు జరిగిన ఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతున్నారా?

AP: చాలా మంది దోమల నుంచి రక్షణకు మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతుంటారు. అయితే దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో నిద్రపోతుండగా మస్కిటో కాయిల్ దుప్పటికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిర్లక్ష్యం చేయకుండా నిద్రకు ముందు కాయిల్ ఆర్పివేయడం లేదా బెడ్‌కు దూరంగా ఉంచుకోవాలి.
News December 29, 2025
వరంగల్: యూరియా యాప్ డౌన్..!

జిల్లా రైతులకు యూరియా యాప్ సరిగా పని చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ఓపెన్, డేటా లోడ్ కాకపోవడంతో యూరియా నమోదు, స్లిప్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్య వల్ల ఎరువుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో రైతులు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News December 29, 2025
తిరుపతి: ఆ భక్తుల పరిస్థితి ఏంటో..?

వైకుంఠ ఏకాదశి సమయంలో తమిళనాడు భక్తులు పాదయాత్రగా తిరుమలకు ఎక్కువ సంఖ్యలో చేరుకుంటారు. టీటీడీ ఎన్ని అవగాహన ప్రకటనలు చేసినా వారు మాత్రం తిరుపతికి చేరుకుని నిరసనలకు దిగిన ఘటనలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మొదటి మూడు రోజులు టోకెన్లు లేకుండా వచ్చే భక్తులను TTD, పోలీసులు ఎలా నిలువరిస్తారో చూడాలి మరి.


