News March 2, 2026
గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు రద్దు

గల్ఫ్ యుద్ధంతో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్‌కు అన్ని ఫ్లైట్స్, ఐరోపా దేశాలకు వెళ్లే 6 విమానాలను ఈరోజు రాత్రి 11.59 గంటల వరకు రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. దుబాయ్, షార్జా విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. అటు దుబాయ్, సౌదీ, కువైట్ ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News March 3, 2026
చంద్రగ్రహణమైనా ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి!

చంద్రగ్రహణం వల్ల ఈరోజు దేశంలోని ఆలయాలు మూతపడినా కొన్ని మాత్రం తెరిచే ఉంటాయి. ఏపీలో శ్రీకాళహస్తి ఈ జాబితా ఉండగా, తమిళనాడులో అరుణాచలేశ్వర ఆలయం ఉంది. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం కూడా ఈరోజు తెరిచే ఉంటాయి. ఇక ఉత్తరాదిలో మహాకాళేశ్వర్ (ఎంపీ), కల్కాజీ దేవి (ఢిల్లీ), విష్ణుపద్ (బిహార్), లక్ష్మీనాథ్ టెంపుల్ (RJ), కల్పేశ్వర్ (UKD) ఆలయాలు ఈరోజు తెరిచే ఉంటాయి.
News March 3, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 3)

1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషేడ్జీ టాటా జననం
1937: రచయిత సత్యం శంకరమంచి జననం
1967: సింగర్ శంకర్ మహదేవన్ జననం
1969: సినీ నటి మధుబాలా జననం
2002: పార్లమెంటు తొలి దళిత స్పీకర్ బాలయోగి మరణం
2003: MRF వ్యవస్థాపకుడు కేఎం మామ్మెన్ మాపిళ్లై మరణం
2008: తెలుగు సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి నగరాజకుమారి మరణం.
News March 3, 2026
గల్ఫ్ నుంచి తిరిగొస్తున్న భారతీయులు

ఇరాన్ దాడులతో నిలిచిన పోయిన విమాన సేవలను గల్ఫ్ దేశాలు క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు తిరిగొస్తున్నారు. ఇప్పటికే అబుదాబి నుంచి ఢిల్లీ, బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి. దుబాయ్ నుంచి కూడా విమానం బయలుదేరింది. కాగా అక్కడి గగనతల స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఈరోజు సౌదీలోని భారతీయుల కోసం ఇండిగో పది రిలీఫ్ ఫ్లైట్లు నడపనున్నట్లు తెలుస్తోంది.


