News March 23, 2026
గల్ఫ్ రూట్లను మైన్స్‌తో నింపేస్తాం: ఇరాన్ హెచ్చరిక

తమ దేశ తీరం, ద్వీపాలపై దాడికి యత్నిస్తే గల్ఫ్ రూట్లను సీమైన్స్‌తో నింపేస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఫ్లోటింగ్ మైన్స్‌ను తీరం నుంచే రిలీజ్ చేస్తామని స్పష్టంచేసింది. అదే జరిగితే హార్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితే గల్ఫ్ అంతటా సుదీర్ఘకాలం ఉంటుందని చెప్పింది. 1980ల్లో పెట్టిన సీమైన్స్‌ను తొలగించేందుకు మైన్ స్వీపర్లు ప్రయత్నించి ఫెయిలైన విషయం మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చింది.
Similar News
News April 8, 2026
ఈ రాత్రికే అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం?

అమెరికా, ఇరాన్ మధ్య ఈ రాత్రికే ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు CNN నివేదిక వెల్లడించింది. ఇక తాము శాంతి, యుద్ధం రెండింటికీ సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. అలాగే పాక్ చేసిన రెండు వారాల సీజ్ ఫైర్ రిక్వెస్ట్‌పై కూడా ఆ దేశం సానుకూలంగా రివ్యూ చేస్తున్నట్లు పేర్కొంది. కాగా ట్రంప్ హయాంలో ఇరాన్ టెర్రరిజం కొనసాగదని, అంతం అవుతుందని వైట్ హౌస్ ట్వీట్ చేసింది.
News April 8, 2026
ట్రంప్ డెడ్‌లైన్‌ను పొడిగిస్తారా?

ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో 3 గంటల్లో ముగియనుంది. అయితే ఇరాన్‌తో తీవ్ర చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ మీడియాకు చెప్పారు. మరోవైపు 2 వారాలపాటు డెడ్‌లైన్ పొడిగించాలన్న పాక్ విజ్ఞప్తిని ట్రంప్‌కు తెలియజేశామని, దీనిపై ఆయన త్వరలో స్పందిస్తారని వైట్‌హౌస్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డెడ్‌లైన్‌ను పొడిగిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
News April 8, 2026
US, ఇరాన్ వార్నింగ్స్.. గల్ఫ్ దేశాల్లో అలర్ట్!

US, ఇరాన్ పరస్పర హెచ్చరిక నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అలర్ట్ అయ్యాయి. 6 గంటలపాటు ఇళ్లలోనే ఉండాలని కువైట్ తమ దేశ ప్రజలకు సూచించింది. ఇక ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. అటు ఖతర్‌లో థ్రెట్ అలర్ట్ జారీ చేశారు. అధికారుల సూచనలు పాటించాలని అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. సౌదీ అరేబియాకు రావొద్దని, హజ్ యాత్రను విరమించుకోవాలని US ఎంబసీ తమ దేశస్థులకు సూచించింది.


