News September 27, 2025
గల్లంతయిన విద్యార్థి కుటుంబానికి కలెక్టర్ భరోసా

ఈనెల 25న కర్నూలు కేసీ కెనాల్‌లో ఈతకు వెళ్లి అశోక్ మృతిచెందగా, ప్రశాంత్ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సిరి మరణించిన విద్యార్థి అశోక్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థి ప్రశాంత్ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 27, 2025
100 కాదు 112: కర్నూలు ఎస్పీ

ఆపదలు, అత్యవసర పరిస్థితులు, సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 112 సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం పేర్కొన్నారు. ఫోన్ చేసిన వెంటనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి బ్లూ కోల్ట్స్ రక్షక్ పోలీసులు చేరుకుంటారన్నారు. పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 100 నుంచి 112కు ప్రభుత్వం మార్చిందని, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
News September 26, 2025
పంట రుణాల మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

పంట రుణాల మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ డా.సిరి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
News September 26, 2025
మెగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి టీజీ

రాష్ట్రంలో కేంద్ర భాగస్వామ్యంతో మెగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ శాసనమండలిలో తెలిపారు. కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పారిశ్రామిక నోడ్‌లు, బల్క్ డ్రగ్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.