News May 11, 2024
గల్లా మాధవిపై ఫేక్ ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవిపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ నాయకులు బి.వి రామాంజనేయులు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులాలు, మతాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News December 21, 2025
ANU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 2వ ఏడాది రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి నిర్వహిస్తామని..ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 29లోపు, రూ.100 ఫైన్‌తో 30లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.
News December 20, 2025
మంగళగిరి: 79వ రోజు మంత్రి లోకేశ్ ‘ప్రజాదర్బార్’

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో శనివారం మంత్రి లోకేశ్ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. RTCలో మెడికల్ అన్‌ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని బాధితులు కోరగా, సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
News December 20, 2025
జర్నలిస్టుల సెమినార్‌కు వస్తా: మంత్రి లోకేశ్

APUWJ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించే సెమినార్‌కు హాజరవుతానని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని జర్నలిస్టుల బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


