News December 31, 2025
‘గల్వాన్’ గొడవ.. అసలు అప్పుడేమైంది?

<<18714683>>గల్వాన్ లోయ<<>>లో 2020 జూన్ 15న ఇండియా, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా ఆర్మీకి భారత సైనికులు అడ్డునిలిచారు. రాడ్లు, రాళ్లతో 6 గంటలపాటు దాడి చేసుకోవడంతో 20మంది భారత జవాన్లు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటనలో TGకి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’లో సంతోష్‌బాబు పాత్రనే <<18686152>>సల్మాన్<<>> పోషిస్తున్నారు.
Similar News
News December 31, 2025
టెన్త్ అర్హతతో 25,487పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కేంద్ర బలగాల్లో <
News December 31, 2025
జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ

AP: రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాస్‌పుస్తకాలను రైతులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏమైనా తప్పులు గుర్తిస్తే సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. ఊరూరా రెవెన్యూ గ్రామసభల ద్వారా పంపిణీ జరగనుంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తేదీలను ఖరారు చేశారు.
News December 31, 2025
ఇప్పుడు హీరోగా చేయాలనే ఆలోచన లేదు: అనిల్ రావిపూడి

సినిమా ప్రమోషన్లలో హీరోహీరోయిన్లకు తగ్గకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఓ ఈవెంట్‌లో హీరోగా ఎంట్రీ ఎప్పుడిస్తారనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘మనం సక్సెస్‌ఫుల్‌గా ఉంటే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. పొరపాటున అటువైపు వెళ్తే మన పని అయిపోయినట్లే. హ్యాపీగా మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లాలి. ఇప్పట్లో హీరోగా చేసే ఆలోచన లేదు’ అని చెప్పారు.


