News March 12, 2025

గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు: KTR

image

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

Similar News

News February 14, 2026

అనకాపల్లి: ప్రేమ.. త్యాగానికి ప్రతీకగా కళారూపాలు

image

నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి సందర్భానుసారం తన కళానైపుణ్యతతో కళారూపాలను తయారు చేస్తున్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అడుగు చెక్కపై ప్రేమికుల దృశ్యం చెక్కాడు. ఇందుకోసం తనకు గంట సమయం పట్టిందన్నాడు. మరో చెక్కపై బ్లాక్ డే సందర్భంగా అమరులైన వీరులకు ఆర్మీజవాను నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని అద్భుతంగా చెక్కాడు.

News February 14, 2026

రూ.3.32 లక్షల కోట్లతో బడ్జెట్!

image

AP: అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఉ.11.15 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 FYకి సంబంధించిన ఈ బడ్జెట్ రూ.3.32 లక్షల కోట్లకు పైగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉ.10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో పద్దుకు ఆమోదం తెలపనుంది. కాగా బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీలు, రోడ్ల అభివృద్ధితో పాటు పారిశ్రామిక రంగ విస్తరణకు నిధులు కేటాయించే అవకాశముంది.

News February 14, 2026

ఏలూరు: లంచం అడిగితే ఇలా చేయండి

image

ఏలూరు జిల్లాలో అవినీతి నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9440446157, 58, 59 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.