News September 4, 2025

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడిపై త్రిపుర ఎమ్మెల్యే ఫిర్యాదు

image

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడు ప్రతీక్‌పై త్రిపుర ఎమ్మెల్యే ఫిలిమ్ కుమార్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిక్‌తో పాటు నలుగురు యువకులు వచ్చి తనను, తన కుటుంబాన్ని బెదిరించారని పేర్కొన్నారు. 400 మందిని తీసుకువచ్చి గొంతుకోసి చంపేస్తామని బెదిరించారని త్రిపుర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ప్రతీక్, మరికొందరు పోలీసులకు లొంగిపోవడంతో బెయిల్ మంజూరైంది. 

Similar News

News September 6, 2025

ఖైరతాబాద్ గణపతికి శోభయాత్ర రూట్ మ్యాప్

image

ఖైరతాబాద్ మహా గణపతికి కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ కలశ పూజ చేశారు. కొద్దిసేపట్లో మహా గణపతి గంగమ్మఒడికి బయలుదేరనున్నారు. ఈ శోభాయాత్ర టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా ట్యాంక్‌ బండ్‌ వరకు చేరుకోనుంది. బడా గణేశ్ – సైఫాబాద్ ఓల్డ్ పీఎస్- ఇక్బాల్ మినార్- తెలుగుతల్లి ఫ్లైఓవర్- అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్‌కు చేరుకోనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్‌కు తరలివస్తున్నారు.

News September 6, 2025

వెస్ట్- ఈస్ట్ క్రాసింగ్ బషీర్‌బాగ్ జంక్షన్‌లో మాత్రమే అనుమతి

image

HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృత డైవర్షన్లు అమలు చేశారు. ప్రధాన రూట్లు బారికేడ్లతో మూసివేయగా, వెస్ట్- ఈస్ట్ క్రాసింగ్ బషీర్‌బాగ్ జంక్షన్‌లో మాత్రమే వాహనాలకు అనుమతించారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్, కోటి, లిబర్టీ, ట్యాంక్‌బండ్, రాణీగంజ్ వంటి ప్రాంతాల్లో కీలక మార్గమార్పులు అమలులో ఉంటాయి. పౌరులు IRR, ORR వినియోగించాలని పోలీసులు సూచించారు.

News September 6, 2025

HYD: నిమ‌జ్జ‌నోత్సవాల్లో తాగునీటి శిబిరాలు

image

వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. నేడు భారీ శోభయాత్రలు జరగనున్న నేపథ్యంలో డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో 123 శిబిరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.