News November 15, 2025

గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలి: SP

image

బాపట్ల జిల్లాకు వస్తున్న గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. సూర్యలంక వద్ద గవర్నర్ పర్యటించనున్న ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, తిరిగి వెళ్లే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

image

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 15, 2025

రామాయ‌ణంలోని ముఖ్య‌ ఘ‌ట్టంతో ‘వారణాసి’: రాజ‌మౌళి

image

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొద‌లు పెట్టేట‌ప్పుడు రామాయ‌ణంలో ముఖ్య‌మైన ఘ‌ట్టం తీస్తున్నాన‌ని అస్స‌లు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద న‌డ‌వ‌డం లేదు, గాల్లో ఉన్నాన‌ని అనిపించింది’ అని అన్నారు. మహేశ్‌కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్‌బంప్స్ వ‌చ్చాయని తెలిపారు.

News November 15, 2025

జనగామ: 17 నుంచి పత్తి కొనుగోళ్ల నిలిపివేత

image

తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 17 నుంచి జనగామ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ పత్తి కొనుగోళ్లు, ప్రైవేటు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజ్ తెలిపారు. కావున.. రైతులు మార్కెట్‌కు, జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.