News March 11, 2025

గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్న కేసీఆర్

image

మార్చి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై గవర్నర్ ప్రసంగం వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడింది లేదు. మరి ఇప్పుడైనా వస్తారో లేదో అంటే వేచి చూడాల్సిందే !

Similar News

News February 25, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

News February 25, 2026

GNT: జాబ్ మేళాలతో లక్ష మందికి ఉద్యోగాలు

image

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి లోకేశ్ శాసనసభలో తెలిపారు. ఇందుకోసం క్లస్టర్ బేస్డ్ విధానంతో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పన చేపడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జాబ్ మేళాల ద్వారా 1.08 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.

News February 25, 2026

నల్గొండ జిల్లాలో ముగ్గురు వైద్యులపై వేటు

image

రాష్ట్రంలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నల్గొండ జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రియదర్శిని, మాధురి, శ్రీవిద్య మాధ ఉన్నారు.